Tadwai | ఇందిరాగాంధీకి నివాళులు

Tadwai | ఇందిరాగాంధీకి నివాళులు

Tadwai | కామారెడ్డి, తాడ్వాయి, ఆంధ్రప్రభ : ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ (Congress party) కార్యాలయంలో నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ (Indira Gandhi) ఫోటోకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాబోయే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు.

గ్రామాల్లో కాంగ్రెస్ (Congress) పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు గైన శివాజీ, అధికార ప్రతినిధి షౌకత్, మండల ఉపాధ్యక్షులు రాజివ్, గ్రామ అధ్యక్షుడు మెట్టు చంద్రం, మాజీ ఏఎంసీ చైర్మన్ శ్యామ్ రావు, వెంకట్రాంరెడ్డి, సుధాకర్ రావు, నరసారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply