MLA | దేశ సంఘటితానికి ఇందిరా గాంధీ విశేష కృషి
జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
MLA | జగిత్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : దేశ సంఘటితానికి ఇందిరా గాంధీ విశేష కృషి చేశారని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ (Dr. Sanjay Kumar) అన్నారు. దేశ సమగ్రత కోసం, పేదరిక నిర్మూలన కోసం పాటుపడిన ఉక్కు మహిళ, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే డా. సంజయ్ మాట్లాడుతూ.. దేశ సంఘటితానికి ఇందిరా గాంధీ (Indira Gandhi) విశేష కృషి చేశారని, బ్యాంకుల జాతీయకరణ, ఆర్థిక సంస్కరణలు ఒక మైలురాయి గా నిలిచిందన్నారు. పేద ప్రజల సొంతింటి కలకు ఇళ్ల నిర్మాణం, పేదరిక నిర్మూలన ఇందిరా గాంధీ చేపట్టారన్నారు. దేశంలో రాజ భరణాలు రద్దు చేశారని, భూ సంస్కరణలు అమలు చేయడం సాహసోపేత నిర్ణయమన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ పేరిట ఇళ్ల నిర్మాణం రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్లు గిరి నాగభూషణం, ఆడువాల జ్యోతి లక్ష్మణ్, పట్టణ నాయకులు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

