MINISTER|వెంకటకృష్ణారావు సేవలు అనిర్వచనీయం

- మంత్రి కొల్లు రవీంద్ర
MINISTER|అవనిగడ్డ, ఆంధ్రప్రభ : దివిసీమ ఉప్పెన సమయంలో మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు చేసిన సేవలు అనిర్వచనీయమని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బుధవారం అవనిగడ్డలోని గాంధీ క్షేత్రంలో జరిగిన ఉప్పెన మృతుల సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. 1977వ సంవత్సరంలో దివి సీమ ఉప్పెన కారణంగా పదివేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి మంత్రిగా ఉన్న మండలి వెంకటకృష్ణారావు పలు స్వచ్ఛంద సంస్థలను, రాజకీయ నాయకులను, పలువురు సినీ ప్రముఖులతో కలసి దివిసీమను పునర్ నిర్మించేందుకు ఎనలేని కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.
ఆయనను స్పరిచుకుంటూ ఇలాంటి సంస్కరణ సభలు నిర్వహించడం ఎంతో మంచి విషయం అని కొనియాడారు. కోడూరు, నాగాలంక మండలాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరగడం ఇప్పటికి కూడా కళ్ళకు కట్టినట్లు ఈ రోజు ఫోటో ఎగ్జిబిషన్లో కనిపిస్తుందని తెలిపారు. అలాంటి మహనీయుని ఆశయాలను కొనసాగించేందుకు, ఆయన తనయుడు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ శతజయంతి వేడుకలు నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారని అన్నారు. తొలుత మండలి వెంకటకృష్ణారావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
