Telangana | ఎమ్మెల్యే కృషి ఫలించింది..

Telangana | ఎమ్మెల్యే కృషి ఫలించింది..
ఎమ్మెల్యే తోట కృషితో ఎకరానికి 10 క్వింటాల్ సోయా కొనుగోలు
డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి
Telangana | డోంగ్లి, ఆంధ్రప్రభ : ఎమ్మెల్యే తోట రైతుల పక్షపాతి అని డోంగ్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయ్ (Gajanand Desai) అన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు (MLA Thota Laxmikantharao) కృషి ఫలించిందని, నియోజకవర్గంలోని డోంగ్లి, వివిధ మండలాల ప్రాంతంలో పెట్టుబడి తక్కువ ఉండటం, దిగుబడి ఎక్కువ రావటంతో రైతులందరూ అత్యధికంగా సోయా పంటను సాగు చేస్తుంటారన్నారు. ఈ సంవత్సరం కూడా సోయా పంట దిగుబడి ఆశాజనకంగా రావటం, ఎకరానికి 7.62 నుండి 10 క్వింటాల సొయా పంట దిగుబడి వచ్చిందన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ఒక క్వింటాల్ కు రూ.5328 మద్దతు ధర ఇచ్చి సోయా కొనుగోలు చేయటం జరుగుతుందన్నారు.
కానీ ఎకరానికి కేవలం 7.62 క్వింటాల్ మాత్రమే కొనుగోలు చేయడానికి నిబంధన ఉండటంతో రైతులు (farmers) అయోమయ పరిస్థితిని ఎదుర్కొన్నారని, దీనిని గ్రహించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రత్యేకంగా ఇటీవల నాఫేడ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్చలు జరిపి సోయా రైతుల పరిస్థితిని వివరించడమే కాకుండా ఎకరానికి 7.62 నుండి 10 క్వింటాల్ వరకు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేయటంతో స్పందించిన నాఫెడ్ అధికారులు ఎకరానికి 10 క్వింటాల్ సోయా కొనుగోలు చేయాలని, ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ అన్ని ఎకరాల సొయా కొనుగోలు చెయ్యాలని ఆదేశాలు జారీ చేయటంతో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు (MLA Thota Laxmikantharao) కృషి ఫలించిందన్నారు. ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావుకు మండల రైతులు ధన్యవాదాలు తెలియజేశారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి సైతం ఎమ్మెల్యే తోటకు కృతజ్ఞతలు తెలిపారు.
