Encounter | దేవ్ జీ.. అజాద్ ఖతం?

Encounter | దేవ్ జీ.. అజాద్ ఖతం?

  • మారేడుమిల్లిలో మరో ఎన్ కౌంటర్
  • ఏడుగురు మావోయిస్టులు మృతి

Encounter, ( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో/ మారేడుమిల్లి) ఏపీ (AP) అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడు మిల్లిలో బుధవారం తెల్లవారుజామున , పోలీసులు మావోయిస్టుల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టులు (Seven Maoists) Dead) మృతి చెందారు. వీరిలో కీలక నేత దేవ్ జీ, ( Maoist CMC Devji) ఆజాద్ (Azad) ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దేవ్ జీ ఆచూకీ లేదని అడిషనల్ డీజీ ప్రకటించారు. కానీ మృతుల్లో దేవ్ జీ, అజాద్ ఉన్నట్టు ప్రచారం వైరల్ అవుతోంది. ఏపీ ఎడిషనల్ డీజీ మహేశ్ లడ్డా తెలిపారు. మంగళవారం ఏపీలోని నాలుగు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్న 50 మంది పీజీఎల్ఏ సభ్యులను అరెస్టు చేశారు. వీరి నుంచి భారీ స్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మారేడుమిల్లిలో మృతుల వివరాలు తెలియరాలేదు.

ఈ విషయాన్ని విజయవాడ పోలీసు కమిషనకేట్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చత్తీస్‌గఢ్ నుంచి ఏపికి రావాలని మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారునిఘా వర్గాలు మావోయిస్టుల కదలికలు పై ప్రత్యేక దృష్టి పెట్టారునవంబరు 17న కీలకమైన ఆపరేషన్ చేపట్టాం, నిన్న మారేడుమిల్లిలో హిడ్మా, ( Maoist CMC Hidma) మరో ఐదుగురు ఎన్ కౌంటర్ లో చనిపోయారు, వాళ్ల నుంచి సేకరించిన సమాచారం తో ఎక్కడెక్కడ మావోయిస్టులు లు ఉన్నారని దృష్టి పెట్టాం అని లడ్డా వివరించారు. ఎక్కడా ఎవరికీ ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశాం అని లడ్డా తెలిపారు. రాష్ట్ర చరిత్ర లో ఇంతమంది కీలక వ్యక్తును పట్టుకోవడం ఇదే ప్రధమమని, కేంద్ర, రాష్ట్ర, ఏరియా, కమిటీ సభ్యులు, ఫ్లాటూన్ టీం లను పట్టుకున్నాం అన్నారు. 45 ఆయుధాలు, 272 రౌండ్స్, రెండు మ్యాగజైన్, 750 గ్రాముల వైర్, ఇతర సామాగ్రి ని స్వాధీనం చేసుకున్నారు. ఫీల్డ్ సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ పూర్తి చేశారు, ఇందులో పాల్గొన్న సిబ్బందికి లడ్డా అభినందనలు తెలిపారు. మా ఇంటిలిజెన్స్ విభాగం ఈ విషయంలో బాగా పని చేసిందిమాకు ముందే సమాచారం వచ్చింది.

మావోయిస్టు రహిత రాష్ట్రమే లక్ష్యం..

మావోయిస్ట్ రహిత గా రాష్ట్రంగా ఏపీని Maoist free State AP) త్వరలోనే మార్చనున్నాం అని ఏపీ అడిషనల్ డీజీ మహేష్ లడ్డా అన్నారు. చత్తీసగఢ్ లో (Chhattisgarh) చాలా ముమ్మరంగా కూంబింగ్ జరుగుతోంది.. ఈ నేపధ్యంలోనే వాళ్ళు కొత్త ప్రాంతాలను వెతుక్కుంటున్నారు . కేంద్ర కమిటీ సభ్యుల ప్రొటెక్షన్ టీమ్ ను ముందుగా పంపి తర్వాత నాయలకు వద్దామన్న ప్లాన్ ఉంది, మావోయిస్ట్ నేత దేవ్ జి ఇంకా పట్టుబడలేదు.. ఆయన ఎక్కడున్నాడో ఇప్పటివరకూ తెలియదు అప్పారు. ఇంకా ఈ ఆపరేషన్స్ లో తప్పించుకున్న మావోలు ఖచ్చితంగా త్వరలోనే పట్టుకుంటాం ఆపేరేషన్ కగార్ తుది దశకు చేరుకుంది, నిన్న జరిగినవన్నీ ఎపి పోలీస్ ఎక్స్క్లూజివ్ ఆపేరేషన్సే 27 మెంబర్స్ ఉన్నారు.. కొందరు హిడ్మా, కొందరు సౌత్ బస్టర్ కమిటీ, మరికొందరు లోకల్ కారిడార్ ఆఫ్ చత్తీసగఢ్ కమిటీల సభ్యులు ఉన్నారని లడ్డా వివరించారు. వెంటనే మావోయిస్టులపై పై నిఘా పెట్టాం, వారి ఆలోచనలు, కార్యకలాపాలు ను గమనించాం, అన్నీ సెట్ చేసుకున్నాక ఒకేసారి వారందరినీ పట్టుకున్నాం అని లడ్డా అన్నారు. తెలంగాణ లో కొంతమంది ఇటీవల సరెండర్ అయ్యారువాళ్ల ద్వారా సమాచారం వెళితే ఇబ్బందులు ఉంటాయని భావించారు . అందుకే కొన్ని రోజులు షెల్టర్ తీసుకునేందుకు ఎపిలో పలు ప్రాంతాలను ఎంచుకున్నారు. మళ్లీ సమయం చూసి వాళ్ల ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారి మూవె మెంట్, ప్లాన్ల పై ఇతర సమాచారం లేదు. హిడ్మాను పట్టుకున్నాక చంపామనే ప్రచారం లో నిజం లేదు అని లడ్డా వివరించారు.

Leave a Reply