Winter season | వణికిస్తున్న చలిగాలి!

Winter season | వణికిస్తున్న చలిగాలి!
Winter season, ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: అతి శీతల పవనాలకు ఆదిలాబాద్ (Adilabad) మన్యం గజగజ వణికిపోతోంది. రోజు రోజుకు సాధారణ ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోతుండడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. మంగళవారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ యు లో 6.8 డిగ్రీ ల కనిష్ట ఉష్ణోగ్రత నమోద యింది. ఇది రాష్ట్రంలోనే అత్యల్ప రికార్డుగా వాతావరణ శాఖ తేల్చింది. ఉదయం నుండే ఆదిలాబాద్, ఉట్నూర్, కొమరం భీం ఏజెన్సీ మంచు దుప్పటి కప్పుకొని పొగ మంచు ఆవహించి చలి తీవ్రత పెరగడంతో జనజీవనం స్తంభించింది. ఉదయం పూట పల్లెల నుండి పట్టణాలకు వెళ్లే సాధారణ రైతు కూలీలు, పాలు, కూరగాయలు అమ్మే రైతులు.. చలిగాలులకు ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకు శీతల గాలులతో పాటు అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఉట్నూర్ ఏజెన్సీలో చలి తీవ్రతకు జనజీవనం స్తంభించింది.
వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఇంటి గడప దాటి బయటకు వెళ్లలేని పరిస్థితి. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో యాచకులు చలి (cold wind) తీవ్రతకు దుర్భర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈరోజు ఉదయం ఆదిలాబాద్ జిల్లాలోనే రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లా సిర్పూర్ యు లో అత్యల్పంగా 6.8 డిగ్రీల సెల్సియస్, తిర్యాని మండలం గిన్నిదరిలో 7.4 డిగ్రీలు, తిర్యానీలో 8.8, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ లో 8.9, ఖానాపూర్, పోచ్చెరలో 9.0, నేరడిగొండ అర్లిటీలో 9.1, సత్నాల, మంచిర్యాల జిల్లా దేవులపల్లిలో 10.9 డిగ్రీ ల ఉష్ణోగ్రత నమోద యింది. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని 9 మండలాల్లో సింగిల్ డిజిట్ లోనే కోల్డ్ వేవ్స్ తో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. చలి పంజా నేపథ్యంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలను ఆరెంజ్ అలెర్ట్ గా ప్రకటించారు.
శీతల గాలులతో అలర్ట్..
ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఏజెన్సీలో మంచు తెరలతో వాతావరణం మబ్బులు కొమ్ముకోవడం, చలిగాలుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం 9 తర్వాతే బయటకు వెళ్లాలని రాత్రి వేళల్లో ఉన్ని వస్త్రాలు, దుప్పట్లు, అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొంటున్నారు. చర్మవ్యా ధులతోపాటు ఉబ్బసం, చలి జ్వరం, శ్వాస కోశ సంబంధ వ్యా ధులు పెరుగుతు న్నాయని డాక్ట ర్లు పేర్కొంటున్నారు. పిల్ల లు, వృద్ధులు ముందు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచి స్తున్నారు. బస్సుల్లో ప్రయాణిం చేవారు తప్పనిసరిగా స్వెటర్లు ఉన్ని వస్త్రాలు ధరించాలని సూచిస్తున్నారు.
చలికాలమ్!
సిర్పూర్ (కొమ్రంభీం) – 6.8 కోహిర్ (సంగారెడ్డి) 7.8 రుద్రంగి (రాజన్న సిరిసిల్ల) – 8.0 భీమారం (జగిత్యాల) – 8.6 మొమినేట్ (వికారాబాద్) – 8.7 నస్రుల్లాబాద్ (కామారెడ్డి) – 8.8 బజారత్నూర్ (ఆదిలాబాద్) – 8.9 నిజామాబాద్ నార్త్ (నిజామాబాద్) – 9.2 భూంపల్లి అక్బర్పేట్ (సిద్దిపేట) – 9.2 నిజాంపేట్ (మెదక్) – 9.5
మరి కొన్ని వార్తలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
https://epaper.prabhanews.com
