MLA | పార్ధివదేహానికి నివాళులు

MLA | పార్ధివదేహానికి నివాళులు
Warangal | గీసుకొండ, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మచ్చాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్(BRS) సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ బోడకుంట్ల ప్రకాష్(Bodakuntla Prakash) తల్లి ఎల్లమ్మ సోమవారం సాయంత్రం మృతిచెందడం జరిగింది.
ఈ రోజు ఎల్లమ్మ పార్దీవదేహాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao), మాజీ ఎమ్మెల్యే(MLA) చల్లా ధర్మారెడ్డి(Challa Dharma Reddy) సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
