ICC Champions Trophy | భారత్ శుభారంభం..
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా శుభారంభం చేసింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడిన భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా, ఈ మ్యాచ్‌లో అసాధారణ ప్రదర్శన కనబరిచి టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్.. సెంచరీతో (125 బంతుల్లో 100) ఆదరహో అనిపించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ భారత్ ముందు 228 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో 229 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 46.3 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
బంగ్లాదేశ్ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ (41) దూకుడుగా ఆడగా… సుభమన్ గిల్ (101 నాటౌట్) సెంచరీతో రాణించాడు. ఇక విరాట్ కోహ్లీ (22), శ్రేయాస్ అయ్యర్ (15) పరుగలకు ఔటయ్యారు. ఆఖర్లో గిల్ తో పాటు కేఎల్ రాహుల్ (41 నాటౌట్) ఆకట్టుకున్నాడు.
కాగా, ఈ టోర్నీలో భాగంగా రేపు కరాచీలో ఆఫ్ఘనిస్థాన్ – దక్షిణాఫ్రికా జట్లు తలపడనుండగా.. టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో దుబాయ్‌లో ఢీ కొట్టనుంది.