Cantonment బోర్డు CEOతో ఎమ్మెల్యే శ్రీగణేష్ భేటీ

Cantonment బోర్డు CEOతో ఎమ్మెల్యే శ్రీగణేష్ భేటీ

  • సర్వీస్ ఛార్జీల విడుదల
  • UPHC స్థలాల కేటాయింపుపై చర్చ

కంటోన్మెంట్, ఆంధ్రప్రభ : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సోమవారం కంటోన్మెంట్ బోర్డు CEO అరవింద్ కుమార్ ద్వివేదిని కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది.

ఎమ్మెల్యే కంటోన్మెంట్‌కు కేంద్రం నుంచి రావాల్సిన సర్వీస్ ఛార్జీలను త్వరగా విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రామన్నకుంట చెరువు అభివృద్ధి, సుందరీకరణకు బోర్డు అనుమతి త్వరగా జారీ చేయాలని అభ్యర్థించారు.

రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ డిపార్ట్‌మెంట్ ద్వారా మంజూరైన రూ.6 కోట్లు విలువైన 4 UPHCల నిర్మాణానికి అవసరమైన స్థలాలను కేటాయించాలని కూడా సూచించారు.

ఎమ్మెల్యే ప్రస్తావించిన అంశాలపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని, సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపి సర్వీస్ ఛార్జీల విడుదల కోసం కూడా కృషి చేస్తామని CEO భరోసా ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Leave a Reply