COTTON | రైతులకు అండ కూటమి ప్రభుత్వం

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

COTTON | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని, అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కష్టపడి పనిచేస్తున్నార‌ని రాష్ట్ర మైనారిటీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక పాలకేంద్రం పక్కన ఉన్న మురారి కాటన్ మిల్ ప్రాంగణంలో, జిల్లా రైతులకు ఉపశమనం కల్పించే దిశగా మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పత్తి రైతులకు సరైన మద్దతు ధర మినిమం Support ప్రైస్ లభించేలా ఈ కొనుగోలు కేంద్రం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. దళారుల వ్యవస్థను తొలగించి, పారదర్శకతతో కూడిన కొనుగోళ్లను ప్రోత్సహించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, నేరుగా కేంద్రంలో పత్తిని విక్రయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్.ఎమ్.డి. ఫయాజ్ , చాబోలు ఇలియాస్ ,బద్రి శెట్టి రవి, రంగ ప్రసాద్, జనసేన పబ్బతి రవి, విజయ గౌరీ, కాల్వ శీను, ధనుంజయ, డైరెక్టర్ మునియర్ ఖలీల్, మరియు నంద్యాల మార్కెట్ యార్డ్ అధికారులు, మిల్లు ఓనర్లు, స్థానిక రైతులు, మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply