COLLECTOR | ప్రజా సమస్యల పరిష్కారానికి మీకోసం

COLLECTOR | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి సోమవారం మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే.బాలాజీ తెలిపారు. సోమవారం మచిలీపట్నంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంలో ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలను స్వీక‌రించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ అర్జీల‌ను వెంట‌నే ప‌రిశీలించి ప‌రిష్క‌రించాల‌ని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం చేయొద్ద‌ని సూచించారు. కార్య‌క్ర‌మంలో జాయింట్ కలెక్టర్ నవీన్, డీఆర్ఓ చంద్రశేఖర్, అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ పాల్గొన్నారు.

Leave a Reply