Saudi Arabia Bus Crash : యా.. అల్లా..సౌదీలో 42 మంది బుగ్గి
- 20 మంది మహిళలు.. 11 మంది చిన్నారులు
- 16 మంది హైదరాబాదీలే .. ఒకే కుటుంబంలో ఏడుగురు బుగ్గి
( ఆంధ్రప్రభ, టీజీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి )
సౌదీ అరేబియాలో ఘోర ఖలి భారతావనిని కుదిపేసింది. గాఢ నిద్రలోని 42 మంది అగ్నికి (42 Indians Dead) ఆహుతయ్యారు. వీరిలో 16 మంది హైదరాబాదీలు (16 deseased Hyderabdis) ఉన్నారు. మహిళలు, చిన్నారులు బుగ్గి అయ్యారు. తెలంగాణలోని ఇతర జిల్లాల యాత్రికులూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చలించిపోయారు. మృతుల వివరాలు తెలుసుకొంటున్నారు. యావత్ యంత్రాంగాన్ని రంగంలోకి దించారు.
ఇక సౌదీ అరేబియా రాయభార సంస్థ నుంచి పూర్తి సమాచారం రప్పిస్తున్నారు. ఇక హైదరాబాద్ లోని ఏ ఏజెన్పీల నుంచి ఎంత మంది యాత్రికులు వెళ్లారు, మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఇంతకీ ఈ ఘోర ఖలి ఎలా జరింగింది? ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? మృతులెవరు? ఈ అంశాలన్నింటిపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

Saudi Arabia Bus Crash : గాఢ నిద్రలోనే.. ఉలికి పాటు
భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న యాత్రికుల బస్పు సౌదీలోని ముఫరహత్ (Soudi Mufarahat) ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. అకస్మాత్తుగా ప్రమాద స్థలిలో విస్పోటనంతో చావు కేకలు వినపడలేదు. కళ్లముందే గాఢనిద్రలోని యాత్రికులు సజీవ దహనం అయ్యారు. సౌదీ అధికారులు, సహాయక బృందాలు ప్రమాద స్థలికి హుటాహుటిన చేరుకున్నాయి. కానీ కళ్ల ముందే 42 మంది కాలిపోతుంటే.. సహాయ చర్యల్లో ఏమీ చేయలేని స్థిత ఏర్పడింది.
మంటల్లో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడిన క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు చేరవేశారు. మృతుల సంఖ్యను ధృవీకరించే పనిలో అధికారులు నిమగ్మమయ్యారు. ఇప్పటికి అందిన సమాచారం మేరకు ఈ ఘోర ప్రమాదంలో 42 మంది మసి బొగ్గుల్లా మారారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాదీలు ఉన్నట్టు ప్రాథమిక సమాచారం.
మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సౌదీ మీడియా ప్రకటించింది. మృతుల్లో 20 మంది మహిళలు, ( 20 women) 11 మంది చిన్నారులు (11 child) చనిపోయారు. ఈ ప్రమాదంలో ( One person a live) ఓ వ్యక్తి బయట పడినట్లుగా తెలుస్తోంది.
Saudi Arabia Bus Crash చలించింన భారత ప్రభుత్వం
భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. సౌదీలోని భారత రాయబార కార్యాలయం నుంచి సమాచారం సేకరిస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలను తెలుసుకుంటోంది. మృతులు, క్షతగాత్రుల వివరాలను సేకరిస్తోంది. యాత్రికుల కుటుంబాలకు సమాచారం అందించేందుకు సౌదీ అధికారులతో సమన్వయం చేసుకుంటోంది.
మరోవైపు పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. మరోవైపు మృతుల్లో తెలంగాణ, హైదరాబాద్ వాసులు ఉండటంతో ఈ యాత్రికులు ఏ ఏజెన్సీ నుంచి యాత్రకు వెళ్లారో తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం డ్రైవర్ అశ్రద్ధ వల్ల జరిగిందా ? రోడ్డు పరిస్థితులు కారణమా ? అనే కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనలో ప్రమాదానికి గురైన బస్సు పూర్తిగా దగ్ధమైందని, బాధితులను గుర్తించడం చాలా సవాలుగా మారిందని అధికారులు విచారం వ్యక్తం చేశౄరు. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు.
YAA ALLAH : అంతులేని హైదరాబాధ

ఈ ఘోర ప్రమాదంలో అత్యధిక మంది హైదరాబాదీలు ఉన్నారనే సమాచారంతో తెలంగాణలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మల్లేపల్లి,(Mallepalli, bazar Ghat) బజార్ ఘాట్ ప్రాంతాలకు చెందిన సుమారు 16 మంది యాత్రికులు ఉన్నట్లు తెలిసింది. ఈ యాత్రికులు (Mehidipantan) మెహదీపట్నంలోని రెండు ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీల (Two Travel Agencies) ద్వారా ఉమ్రా యాత్రకు వెళ్లారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ( sane family seven ) ఏడుగురు ఉన్నట్లు తెలిసింది.
ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Telangana CM ) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ (Chief secretary0 రామకృష్ణారావు వెంటనే విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చించారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్‌తో సమన్వయం చేసుకుని సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
బాధితుల కుటుంబాలకు సకాలంలో సమాచారం, సహాయం అందించేందుకు రాష్ట్ర సచివాలయంలో (secretiarate) ప్రత్యేక కంట్రోల్ రూమ్ ( Control Room) ను ఏర్పాటు చేశారు. బాధితుల కుటుంబ సభ్యులు లేదా సమాచారం కావాల్సిన వారు సంప్రదించడానికి అధికారులు హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేశారు
+91 79979 59754, +91 99129 19545 (Infrmation Numbers) ద్వారా సంప్రదించాలని కోరారు. ఏ ఏజెన్సీ ద్వారా తెలంగాణ వాసులు ఉమ్రా యాత్రకు వెళ్లారో తెలుసుకునేందుకు హజ్ కమిటీ ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్పష్టత ఈరోజు మధ్యాహ్నం వరకు వచ్చే అవకాశం ఉంది.
Saudi Arabia Bus Crash : ప్రమాదానికి కారణాలేంటీ ?
ఉమ్రా యాత్రలో భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ‘సౌదీ అరేబియాకు ప్రతి యేట లక్షలాది మంది యాత్రికులు వెళ్తుంటారు. రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. 2023లో జరిగిన ప్రమాదంలో 20 మంది యాత్రికులు మరణించారు. రోడ్డు భద్రతా మార్గదర్శకాలు జారీ చేస్తూ, ట్రావెల్ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. కాగా ఈ దుర్ఘటన యాత్రికుల భద్రతను మరింత పెంచాలి’ అని నిపుణులు అభ్యర్థించారు. సౌదీ అరేబియాల
Saudi Arabia Bus Crash : సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదం పై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని… అందులో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారని మీడియా వార్తలు వచ్చాయి. వెంటనే స్పందించిన సీఎం పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్, డీజీపీ ని అదేశించారు.
తెలంగాణకు చెందిన వారు ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబస్సీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. అవసరమైతే వెంటనే తగిన సహాయక చర్యలకు రంగంలోకి దిగాలని అదేశించారు. సీఎం అదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌ను అప్రమత్తం చేశారు. ప్రమాదం లో మన రాష్ట్రానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని అదేశించారు.
రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్లోను ఏర్పాటు చేసినట్టు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తెలియజేశారు. బాధిత కుటుంబాలకు తగు సమాచారాన్ని, సహాయ సహకారాలు అందించేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో ఈ క్రింది నెంబర్ల ద్వారా సంప్రదించాలని పేర్కొన్నారు
Saudi Arabia Bus Crash ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దిగ్భ్రాంతి
సౌదీ అరేబియాలో చోటు చేసుకున్న బస్సు ప్రమాదంపై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ (MP Asaduddin Owisi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా యాత్ర ముగించుకుని మదీనా వెళ్తుండగా ఈ బస్సు ప్రమాదం జరిగింది అని తెలుస్తోంది అని అన్నారు.
రెండు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా యాత్రికులు ఉమ్రా యాత్రకు వెళ్ళినట్లు తెలిసింది అని అన్నారు. రియాద్‌లోని ఇండియన్ ఎంబసీ అబు మాథేన్ జార్జ్ (Abu Mathen George) తో మాట్లాడినట్లు తెలిపారు. సౌదీ అరేబియాలో నివశిస్తున్న భారతీయులు, ఇతరుల నుంచి సమాచారం అందుతుంది అని తెలిపారు. కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఈ ప్రమాదంపై దృష్టి సారించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు.
Saudi Arabia Bus Crash : కుటుంబ సభ్యులు కన్నీళ్లు
ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే, మక్కా వెళ్లిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతుల్లో తమ వారు ఉన్నారేమోనని తెలుసుకునేందుకు Family members at travel Agencies) ట్రావెల్ ఏజెన్సీల వద్దకు వెళ్లి ఆరా తీస్తున్నారు.

