Kavitha | జనరల్ బోగీలో కవిత ప్రయాణం..

Kavitha | జనరల్ బోగీలో కవిత ప్రయాణం..

Kavitha, హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలతో మమేకమవుతున్న ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha ) రైలు ప్రయాణం చేశారు. ఆదివారం హైదరాబాద్ నుంచి ఖమ్మం (Khammam) వరకు శాతవాహన ఎక్స్ ప్రెస్ జనరల్ కంపార్ట్ మెంట్ లో ప్రయాణించారు. ప్రయాణికులతో కలిసి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 4 గంటలకు శాతవాహన ఎక్స్ ప్రెస్ లో బయలుదేరారు. కవిత వెంట జాగృతి (Jagruthi) నాయకులు ఉన్నారు. సోమవారం ఖమ్మం జిల్లాలోని జమలాపురం వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.

అనంతరం సత్తుపల్లి ఏరియా ఆసుపత్రిని సందర్శిస్తారు. ఆతర్వాత సత్తుపల్లిలో జేవీఆర్ ఓపెన్ కాస్ట్ కార్మికులతో సమావేశం కానున్నారు. ఆతర్వాత వైరా కూరగాయల మార్కెట్ సందర్శిస్తారు. ఖమ్మం నియోజకవర్గంలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం అమరవీరుల స్థూపం దగ్గర శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఆతర్వాత పెవిలియన్ గ్రౌండ్స్ లో యువతతో కల్వకుంట్ల కవిత సమావేశం కానున్నారు.

Leave a Reply