Atchampet | ఘనంగా 63 సామూహిక వివాహాలు
- నూతన దంపతులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Atchampet | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణంలో సామూహిక వివాహాలను నిర్వహించిన కౌన్సిలర్ అప్పశివను ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ(Dr. Vamsi Krishna) అభినందించారు. ఈ రోజు అచ్చంపేట పట్టణంలో 63 జంటలకు శివ సొంత ఖర్చులతో వివాహాలు జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అచ్చంపేట(Atchampet) ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ అప శివ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిరుపేదలకు తన సొంత ఖర్చుతో వివాహాలు జరిపించడమే కాక నూతన వధూవరులకు పట్టుబట్టలు, పుస్తెలతాడు, తాళిబొట్టు, మెట్టెలు, మంచం, బీరువాలు తదితర సామాగ్రి ఇవ్వడం చాలా మంచి పరిణామని అన్నారు.
ఒకే వేదికపై 63 జంటలు(63 couples) ఒక్కటిగా ఏకమవడం సంతోషమని, నూతన జంటలు ఆదర్శప్రాయంగా జీవిస్తూ నవ సమాజానికి నాంది పలకాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దంపతులను ఎమ్మెల్యే ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు(Garlapati Srinivas), జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అడ్వకేట్ గంగాపురం రాజేందర్, ఉమామహేశ్వర దేవస్థానం చైర్మన్ మాధవరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత మల్లేష్, సీనియర్ రాజకీయ నాయకులు పోకల మనోహర్, తులసీరామ్, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు హాజరయ్యారు.



