Diabetes Day | మధుమేహం రోగం కాదు..

Diabetes Day | మధుమేహం రోగం కాదు..

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ – నేడు ప్రపంచ మధుమేహ (Diabetes Day) దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కార్యక్రమాల ఇతివృత్తం అవగాహన కల్పించేందుకు మధుమేహ సంరక్షణ అందరికీ అందుబాటులోకి తేవాలయని నిర్ణయించారు. మధుమేహం వ్యాధి ముందస్తు నిర్ధారణ, సకాలంలో చికిత్స, ఆరోగ్య సంరక్షణ అవసరం అంశాల పై వివిధ సంస్థలు, వైద్య నిపుణులు ప్రజలకు సందేశాలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సర్వజన వైద్యశాల, కర్నూలు గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ప్రజలకు ముఖ్య సూచనలు అందించారు.

  • “మధుమేహం ఒక జబ్బు కాదు..
    మధుమేహం (Diabetes) అంటే భయపడాల్సిన రుగ్మత కాదు. శరీరం ఇన్సులిన్‌ను సరైన మోతాదులో ఉత్పత్తి చేయకపోవడం లేదా ఉత్పత్తయిన ఇన్సులిన్‌ కణజాలాల్లో సరిగ్గా పని చేయకపోవడం వల్ల వచ్చే మెటబాలిక్ అబ్నార్మాలిటీ అని ఆయన వివరించారు. ఫాస్టింగ్ షుగర్ 90–110 0.. ఎం జి/ డియల్ మధ్య ఉండాలి.

రాండమ్ బ్లడ్ షుగర్ 160 ఎంజి /డియల్ పైగా ఉంటే డయాబెటిస్ అనుమానం.. రాండమ్ 180 ఎం జి/డిఎల్ దాటితే కిడ్నీల ద్వారా గ్లూకోజ్ బయటకు వెళ్లే ప్రమాదం.. డయాబెటిస్ ఎక్కువ కాలం ఉంటే శరీరంలోని ప్రతి అవయవాన్నీ దెబ్బ తీస్తుంది. 20–30 సంవత్సరాల పాటు డయాబెటిస్‌ నియంత్రణలో లేకపోతే కళ్ల పై,కిడ్నీల పై, హృదయం పై, లివర్‌ పై, నరాల వ్యవస్థ పై ప్రమాదకర ప్రభావాలు చూపుతుందని డాక్టర్ ప్రభాకర్ హెచ్చరించారు. డ్యామేజ్ కానీ అవయవం అంటూ మధుమేహం వదలదు అని ఆయన చెప్పారు.

లక్షణాలు ఎలా గుర్తించాలంటే..
మధుమేహం ప్రారంభ దశలోనే పసిగట్టవచ్చని నిపుణులు అంటున్నారు. తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం.. ఆకలి వేయడం.. బాగా తిన్నా బరువు తగ్గిపోవడం.. ఇవన్నీ మధుమేహానికి ప్రధాన సంకేతాలే. సాధారణ రక్త పరీక్షతోనే నిర్ధారణ సాధ్యమని వైద్యులు సూచిస్తున్నారు.

డయాబెటిస్ (Diabetes) పూర్తిగా పోదు కానీ..
మధుమేహం ఒకసారి వచ్చిన తర్వాత అది పూర్తిగా నిర్మూలం అవుతుందని చెప్పడం అవాస్తవమని.. కానీ దాన్ని సరిగ్గా నియంత్రణలో ఉంచితే ఎలాంటి అవయవ నష్టం జరగదని డాక్టర్ ప్రభాకర్ స్పష్టం చేశారు.

డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడానికి సూచనలు:

  1. ప్రతి రోజూ ఉదయం నడక లేదా వ్యాయామం తప్పనిసరిగా చేయాలి..
  2. పిండి పదార్థాలు తగ్గించి, సమతుల ఆహారం తీసుకోవాలి..
  3. మందుల విషయంలో స్వయంగా నిర్ణయం తీసుకోకూడదు..
  4. షుగర్ టెస్టింగ్ మిషన్ కొనుగోలు చేసి వారానికి ఒకసారి పరీక్షించుకోవాలి..
    మాత్రలు పూర్తిగా ఆపేస్తే డయాబెటిస్ మాయమైపోతుంది అనేది నిజం కాదు..

టైప్–1 డయాబెటిస్‌కు ఇన్సులిన్ తప్పనిసరి..

ఆటోఇమ్యూన్‌ కారణంగా బీటా సెల్స్ పూర్తిగా దెబ్బతిన్న టైప్–1 డయాబెటిస్‌ రోగులకు ఇన్సులిన్ తప్పనిసరి చికిత్స అని ఆయన చెప్పారు. చిట్కాలతో కాదు… క్రమశిక్షణతోనే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. కొంత మంది పిండి పదార్థాలు పూర్తిగా వదిలేసి మటన్, చికెన్ మాత్రమే తింటూ డయాబెటిస్ తగ్గుతుందని ప్రచారం చేస్తున్నారని, ఇది అవగాహన లోపం అని డాక్టర్ ప్రభాకర్ అన్నారు. బరువు తగ్గడం వల్ల కొంత వరకు షుగర్ కంట్రోల్ అవుతుంది కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు. డయాబెటిస్ అనేది మెటబాలిక్ అబ్నార్మాలిటీ. దాన్ని కంట్రోల్ చేయడమే మార్గం అని ఆయన స్పష్టం చేశారు.

  • ప్రజలకు సూచన
    ఒకసారి డయాబెటిస్ వస్తే అది శాశ్వతం. కానీ.. అద్భుతంగా నియంత్రించుకోవచ్చు. పరీక్షలు, వ్యాయామం, ఆహార నియంత్రణ, అవసరమైనప్పుడు మందులు లేదా ఇన్సులిన్ — ఇవి పాటిస్తే.. జీవితాంతం ఆరోగ్యంగా ఉండొచ్చు” అని డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply