Chairman | క‌లెక్ట‌ర్ కార్యాల‌యం ఎదుట ధ‌ర్నా…

Chairman | క‌లెక్ట‌ర్ కార్యాల‌యం ఎదుట ధ‌ర్నా…

  • బీసీలంతా ఐక్యంగా ఉద్యమించాలి!
  • సీఎం వెంటనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి!
  • బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ ముంజాల బిక్షపతి గౌడ్ డిమాండ్!
  • బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా!

Chairman |ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి : విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగ సవరణ ద్వారానే కల్పించి రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ లో పొందపరచాలని బీసీ జేఏసీ ములుగు జిల్లా చైర్మన్ ముంజాల బిక్షపతి గౌడ్ (Munjala Bikshapati Goud) డిమాండ్ చేశారు.

ఈ రోజు బీసీ జేఏసీ పిలుపులో భాగంగా ముంజాల బిక్షపతి గౌడ్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోసపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ను కల్పించడానికి తీసుకువచ్చిన రెండు బిల్లులతో పాటు ఆర్డినెన్స్ ను సైతం హైకోర్టు కొట్టి వేసిందని, న్యాయస్థానాల్లో బీసీ బిల్లులు నిలువని తెలిసినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేయడానికి ప్రయత్నం చేశారని ఆయన విమర్శించారు.

రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం ఏకైక మార్గమని, అందుకు బీసీలంతా ఐక్యంగా ఉద్యమించాలని ఆయన కోరారు. సీఎం రేవంత్ రెడ్డికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వం(Central Govt)పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి బీసీ ఉద్యమానికి మద్దతు పలకాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల జేఏసీ హనుమకొండ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్(Madasi Suresh), దళిత బహుజన ఫ్రంట్ (డిబీఎఫ్)జిల్లా కార్యదర్శి చుంచు నరేష్, వడ్డెర సంఘం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ తురక వీరబాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply