AP | పక్వానికి రాని పంటను కోయొద్దు..

AP | పక్వానికి రాని పంటను కోయొద్దు..

AP| గూడూరు, ఆంధ్రప్రభ : పక్వానికి రాకుండానే వరి పైరును కోయరాదని జిల్లా కలెక్టర్ (District Collector) డీకే.బాలాజీ రైతులను కోరారు. గురువారం జిల్లా కలెక్టర్ గూడూరు మండలంలో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను, వరి పైరులను కలెక్టర్ పరిశీలించారు.

రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం కొంతమంది రైతులు (farmers) తమ ప్రక్కనున్న వరి పైరులను యంత్రాల ద్వారా కోస్తుంటే వారీ ఫైర్లను కూడా పక్వానికి రాకుండానే కోయడం జరిగిందన్నారు. ఈసారి అలా కాకుండా పక్వానికి రాని వరి పైరును తొందరపడి కోయరాదని రైతులకు (farmers) సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు సేవా కేంద్రాల ద్వారా దాన్యం కొనుగోలు చేస్తున్నామని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave a Reply