Andhra Prabha Editorial | ఉగ్ర‌వాదంపై వ్యూహం మారాలి

Andhra Prabha Editorial | ఢిల్లీలోని ఎర్రకోటవద్ద సోమవారం జరిగిన పేలుళ్ల సంఘటన తీరు చూస్తుంటే.. వారి వ్యూహాలు మారినట్లు అర్థమవుతోంది. ఉగ్రవాదులు కొత్త పంథాను ఎంచుకున్నట్లు తేలింది. టెర్రరిస్టు భావజాలంతోను, ఉగ్ర శిక్షణ పొంది, దేశ సరిహద్దులు దాటివచ్చినవారు దాడులకు పాల్పడటం ఇంతవరకూ చూశాం. ఇప్పుడు దేశంలోనే ఉంటూ.. ఇక్కడే విద్యనభ్యసించి.. ఇక్కడే ఉద్యోగాలు చేస్తూ ఉగ్రకుట్రలకు పూనుకున్నారని తాజా ఉదంతం ద్వారా అర్థమయ్యింది. ఇది మారిన ఉగ్రవాదుల వ్యూహానికి అద్దం పడుతోంది. తాజా సంఘటన సాదాసీదా పరిణామం కాదు. దర్యాప్తులో వెల్లడవుతున్న విషయాలు దిగ్రమ కలిగిస్తున్నాయి. 26/11 దాడుల తరహాలోనే విధ్వంసం సృష్టించే కుట్రగా అనుమానిస్తు న్నారు. అందువల్ల ప్రభుత్వం కౌంటర్ టెర్రరిజం వ్యూహానికి పదునుపెట్టాలి.

ఢిల్లీ పేలుళ్ల ద్వారా ప్రజలను మానసికంగా దెబ్బతీయ డానికి ముష్కరులు ప్రయత్నించినట్టుగా కనిపిస్తోంది. జనవరి 26వ తేదీన భారత గణతంత్ర దినోత్సవాల సంద ర్భంగా, భారత్లో పలు చోట్ల పేలుళ్ల కు కుట్రపన్నిన ముఠాయే ఈ పేలుళ్ల కు పాల్పడినట్టు ఆధారాలు బయట పడుతున్నాయి. ఉగ్రవాదం భౌగోళికంగా కుచించుకుని పోతున్నట్టు కనిపిస్తున్నా, మానసికంగా అది ప్రజలను భయ విహ్వలులను చేస్తోంది. ఢిల్లీకి 40 కిలో మీటర్ల దూరంలో ఫరీదాబాద్ వంటి నగరాల్లో ఉగ్రవాద ముఠాలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని బాంబులు, గ్రెనేడ్లు ఇతర పేలుడు సామగ్రిని నిల్వ చేస్తున్నాయి. వాటిని ఎక్కడ ప్రయోగించాలో రెక్కీలను నిర్వహిస్తున్నాయి. తమకు సహాయాన్ని అందించే ముఠాలను ఏర్పాటు చేసు కుంటున్నాయి. ఉగ్రవాదం ఇప్పుడు జమ్ము కాశ్మీర్కే పరిమితం కావడం లేదు. దేశ రాజధానిలో… అత్యంత భద్రత ఉండే ఎర్రకోట సమీపంలో పేలుడుకు పాల్ప డటమంటే సామాన్యమైన విషయం కాదు.

ఉగ్రదాడులు, పేలుళ్లు మనదేశంలో కొత్త కాదు. 2008లోనూ, 2011 లోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఉగ్రవాదుల వలలో మనదేశంలో బాగా చదువుకున్నవారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నవారు పడుతున్నారు. వారంతా సరైన ఉద్యోగాలు దొరక్క, చేస్తున్న ఉద్యోగాల పట్ల ఆసక్తి లేక, ఉగ్రవాద సంస్థల ఉచ్చులో పడుతున్నారు. తాజా పేలుళ్ల ఘటన సీసీ కెమేరాల్లో చిక్కిన దృశ్యాలను పరిశీలిస్తే, విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట ప్రాంతం లో విధ్వంసం సృష్టించడానికి నిందితుడు రెండేళ్ల కిందటే పథకం వేసినట్టు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా పేలుళ్ళకు ఈ ముఠా రెండేళ్ల నుంచి సన్నాహాలు చేస్తు న్నట్టు వెల్లడైంది. ఈ పేలుళ్ళలో నిందితులు ముగ్గురూ వైద్యులే కావడం గమనార్హం. ఒక రోగి మరణానికి కార ణమై ఉద్యోగం పోగొట్టుకున్న వైద్యుడు డాక్టర్ ఉమర్ ఈ పేలుడుకు సూత్రధారి. ఫరీదాబాద్ మాడ్యూల్కు తుర్కియా హ్యాండ్లర్తో సంబంధాలున్నట్టు వెల్లడైంది. ఈ పేలుళ్ల కుట్రదారుడైన ఇమామ్ ఇర్ఫాన్ అహ్మదిని భద్రతాదళాలు అరెస్టు చేశాయి. వైట్ కాలర్ జిహాదీలు ఇప్పుడు రంగంలో ప్రవేశిస్తున్నారు. నక్సలైట్లకు సాయం అందిస్తున్న నగర, పట్టణ ప్రాంతాల్లోని విద్యావంతులు, ఉద్యోగస్తుల మాదిరిగానే ఉగ్రవాదులకు సాయం అందించే విద్యావంతులు, పలు వృత్తుల్లో ఉన్న వారు ఇప్పడు అనేక మంది తయారవుతున్నారు. విద్యావంతు లైనంత మాత్రాన వారికి ఉగ్రవాదులతో, ఉగ్రవాద సంస్థ లతో సంబంధం ఉండదని అనుకోవడాని వీలు లేదు.

కొద్ది వారాల క్రితం అరెస్టు అయిన ఎనిమిది మంది మదరసాల నుంచి రిక్రూట్ అయిన వారు కారు. వీరంతా ఎంబీబీఎస్ పట్టభద్రులు. కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ మెడికల్ కాలేజీ నుంచి పట్టాలు అందుకున్న వారు. పేలుడు సూత్రధారి ఉమర్ ఎండి చేశారు. స్పెషలిస్టు వైద్యునిగా పని చేస్తున్నారు. అలాగే, షకీల్ అనే మరో ఉగ్రవాది కాశ్మీర్ అనంతనాగ్ మెడికల్ కాలేజీలో పని చేశారు. మూడో వ్యక్తి ఆదిల్ రాథర్ కూడా వైద్యుడే. వీరందరూ పాకిస్తాన్ హ్యాండర్స్ ద్వారా పేలుడు వస్తు వులు సేకరించారు. వీటిలో బాంబు తయారీ సామగ్రి అమ్మోనియం నైట్రేట్ ఆయిల్ కూడా ఉంది. చదువు కున్నంత మాత్రాన వారిలో ఉగ్రవాద భావ జాలం లేదని చెప్పలేం. ఈ పేలుడు కేసును జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తు బృందంలో 10 మంది అధికారులు ఉన్నారు. వీరిలో డీజీ స్థాయి ఉన్న తాధికారులు ఉన్నారు. ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్నవారిని ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధ వారం భూటాన్ నుంచి రాగానే లోక్ నాయక్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఇది ఆత్మాహుత దాడి అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఉగ్రవాదుల లక్ష్యం జమ్ము, కాశ్మీర్ లోని ప్రాంతాలే కాదు. దేశంలోని పెద్ద నగరాలు, జన సమర్థంగల ప్రాంతాలు కూడా ఉంటు న్నాయి. గత ఏడాది బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ వద్ద, ఫరీదా బాద్ మాడ్యూల్ను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. ఫరీదాబాద్ మాడ్యూల్ వద్ద దర్యాప్తు అధికారులు దాదాపు మూడు టన్నుల పేలుడు వస్తువు లను స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుళ్ళ ప్రజల్ల అప్రమత్తత మరింత అవసరమనే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి.

     

Leave a Reply