Seethakka : సీడీని ఆవిష్కరించిన మంత్రి సీతక్క

ఆంధ్రప్రభ ప్రతినిధి, ములుగు : రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) సేవల పై మద్దెల సమ్మక్క, రాజేందర్ రచించి పాడిన కొత్తపాట సీడీని ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క ఆవిష్కరించారు. వారు సొంతంగా రచించి పాట పాడిన సమ్మక్క, రాజేందర్‌లను మంత్రి సీతక్క అభినందించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Leave a Reply