Kadem | బ్రతికించండి ..

Kadem | బ్రతికించండి ..

కడెం, ఆంధ్రప్రభ – నిర్మల్ (Nirmal) జిల్లా కడెం (Kadem) మండలంలోని లింగాపూర్ గ్రామానికి చౌడారపు నరేష్, కవితలకు ఇద్దరు పిల్లలు. వీరిది నిరుపేద కుటుంబం కావడంతో బ్రతుకుతెరువు కోసం మహారాష్ట్రలోని ముంబైకు (Mumbai) వెళ్లి నరేష్ రోజు వారి కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంతలోనే ఆ కుటుంబాన్ని ఒక్కసారిగా చీకటి కమ్మేసింది. ఏడు సంవత్సరాల పాప అనారోగ్యం ఎదురైంది. వైద్య చికిత్సకు 12 లక్షల రూపాయలు ఖర్చవుతుందని తెలియడంతో కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ దాతల చేయూత కోసం ఎదురుచూస్తున్నారు.

వివరాలలోకి వెళ్తే.. నరేష్ పెద్ద కూతురు చిన్మయ. బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులోని రెయిన్ బో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ వ్యాధి నయం కావడం కోసం సుమారు 12 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో నరేష్ కుటుంబం దాతలు కోసం ఎదురుచూస్తున్నారు. చిన్నారి ఆరోగ్యం మెరుగుపడడానికి దాతల ముందుకు వచ్చి సాయం అందించాలని కోరుతున్నారు. ఆర్థిక సాయం చేయదలచిన వారు 949374 9430 కు ఫోన్ పే లేదా గూగుల్ పే చేయగలరని వారు కోరుతున్నారు.

Leave a Reply