Thermal plant | భూములు కట్టబెడితే ఉద్యమిస్తాం

Thermal plant | భూములు కట్టబెడితే ఉద్యమిస్తాం
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో ఇండోస్సోల్ కంపెనీ(Indosol company) కి ప్రజల భూములను కట్టబెడితే ప్రజా ప్రతిఘటన తప్పదని ధర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు (D. Govinda Rao), ఆదివాసి వికాస్ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబయోగి, న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షుడు వంకల మాధవరావు, సి.పి.ఐ నాయకులు కొన్న.శ్రీనివాసరావు, మానవహక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.జగన్నాథరావు, ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మక. అప్పన్న హెచ్చరించారు.
బుధవారం స్థానిక క్రాంతి భవన్ లో ధర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ (Anti-Dharmal Combat Committee) కార్యదర్శి సవర.సింహాచలం అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశముజరిగింది. ఈ సమావేశంలోవారు మాట్లాడుతూ… ప్రజల భూములను ఇండోసోల్ కంపెనీకి కట్టబెట్టడమే అభివృద్ధా అని జిల్లా మంత్రిని స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నించారు. థర్మల్ పవర్ ప్లాంట్ వలన పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు, థర్మల్ ప్లాంట్ (Thermal plant) వలన ఉద్యోగాలు రావని బూడిది మాత్రమే వస్తుందని తద్వారా జబ్బులు వస్తాయన్నారు, ఎన్నికలకు ముందు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి భూముల వరకు నీరిస్తామని చెప్పి ఎన్నికల అనంతరం మీ భూములు మాకు ఇచ్చేయండి అని చెప్పడం న్యాయమని మంత్రులను ప్రశ్నించారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ (Double Engine Circar) అని చెప్పుకుంటున్న కేంద్రమంత్రి మనకు అనుకూలంగా తీర్పు వచ్చినా కూడా నేరేడు బ్యారేజీ కోసం గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు వేయించుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. నేరడిబ్యారేజి నిర్మాణం జరిగితే జిల్లా సస్య శ్యామలం అవుతుందన్నారు. ధర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేకంగా విశాల ఐక్య ఉద్యమాలు నిర్మాణం చేస్తామన్నారు. నవంబర్ 25వ తేదీన చలో సరుబుజ్జిలి కార్యక్రమం జరపాలని సమావేశం తీర్మానించింది. ఈ కార్యక్రమంలో సవర.మిన్నారావు, సంతోష్, సవర.కువ్వారి, సవర.పెద్దసింహచలం, సవర.వసంతరావు, సవర.కుర్మయ్యా, సవర.సుగన్నా, పి.ఓ.డబల్ యూ ఎస్.కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.
