కేంద్ర మంత్రితో లోకేష్ భేటీ

బీహార్ ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారిన ప్రధాన్

పాట్నా (బీహార్): కేంద్ర విద్యాశాఖ మంత్రి, బీహార్ బీజేపీ ఎన్నికల ప్రచారకర్త ధర్మేంద్ర ప్రధార్‌తో రాష్ట్ర‌ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాట్నాలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బీహార్ లో ఎన్ డీఏ విజయం కోసం ప్రధాన్ శ్రమిస్తున్నారు. గతేడాది హర్యానా, ఒడిశా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయంలో ప్రధాన్ కీలక పాత్ర వహించారు. ఇప్పుడు బీహార్ లో ఎన్ డీఏ విజయం కోసం తీవ్రంగా కృషిచేస్తున్నారు. బీహార్ లో మరోమారు ఎన్ డీఏ సర్కారును గెలిపించేందుకు ప్రధాన్ చేస్తున్న నిర్మాణాత్మక కృషిని మంత్రి లోకేష్ అభినందించారు. బీహార్ లో మరోమారు ఎన్ డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాగలదన్న నమ్మకాన్ని లోకేష్ వ్యక్తంచేశారు. మంత్రి లోకేష్ వెంట ఎంపీలు సానా సతీష్, గంటి హరీష్, కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు.

Leave a Reply