Crime | కుమార్తెపై లైంగిక వేధింపులు… లైట్ గా తీసుకోమంటూ భార్యకు భర్త హితవు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ‘మనం ఊరెళ్లిన సమయంలో నీ స్నేహితుడు మన ఇంటికి వచ్చి కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని.. రాత్రంతా ఇంట్లోనే నిద్రించాడని’భార్య తన భర్తకు చెప్పింది. చేసింది నా స్నేహితుడే కదా పోనీలే అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడమే కాకుండా లైట్ గా తీసుకో అంటూ భార్యకు హితబోధ చేశాడో భర్త.
వివరాల్లోకి వెళితే… బంజారాహిల్స్ రోడ్ నం.5లోని ఓ బస్తీలో నివసించే భార్యాభర్తలు తమ 14ఏళ్ల కూతురితో పాటు మిగతా ఇద్దరిని ఇంట్లోనే వదిలేసి ఈనెల 17వ తేదీన మహబూబ్‌నగర్‌కు వెళ్లారు. అదేరోజు రాత్రి ఆమె భర్త స్నేహితుడు మోహన్‌సింగ్, వారి ఇంటికి వచ్చాడు. ఇంట్లోనే మద్యం సేవించాడు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో నిద్రిస్తున్న బాలిక(14) గదిలోకి వెళ్లిన సోను ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నోరు నొక్కి అక్కడే పడుకున్నాడు. ఆమె అరవడానికి ప్రయత్నించగా బెదిరించాడు. తెల్లవారుజామున 6గంటల ప్రాంతంలో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఇంటికి వచ్చిన తల్లికి బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. ఇదే విషయాన్ని బాధిత తల్లి తన భర్త దృష్టికి తీసుకొచ్చింది..దీనికి భర్త వచ్చింది నా స్నేహితుడే కదా అంటూ భర్త నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి ఈ విషయాన్ని లైట్ గా తీసుకో అంటూ భార్యకు క్లాస్ పీకాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన భార్య వెంటనే కుమార్తెను తీసుకుని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు పరుగెత్తింది.. జరిగిదంతా చెప్పి భర్త, అతడి స్నేహితుడిపైనా కేసు నమోదు చేయించింది. పోలీసులు మోహన్‌సింగ్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.. ఇక భర్తకు పోలీసులు తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చారు.