స్నేహితుడి కుటుంబానికి ఆపన్నహస్తం

ఊట్కూర్, ఆంధ్రప్రభ : మృతి చెందిన స్నేహితుని కుటుంబానికి డిగ్రీ మిత్ర బృందం మేమున్నామంటూ అండగా నిలిచి ఆపన్నహస్తం అందించిన సంఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ వీధికి చెందిన లావరీ రామకృష్ణ కొంత కాలం క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. మృతునికి భార్యా పిల్లలు ఉండడంతో పాటు పేదరికంతో కొట్టు మిట్టాడుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన 2005-06 డిగ్రీ మిత్ర మండలి బృందం సభ్యులు చేయి చేయి కలిపి తమ స్నేహితుడి భార్య లక్ష్మికి రూ.30 వేలు ఆర్థిక సహాయం అందజేయడం తోపాటు దుస్తులు, వంట సామాను అందజేసి స్నేహానికి ఉన్న మాధుర్యాన్ని చాటారు.

Leave a Reply