గొల్లపాలెంలో విషాదం

గొల్లపాలెంలో విషాదం
కరెంట్షాక్తో యువకుడు మృతి
చిత్తూరు, నవంబర్(ఆంధ్రప్రభ) : మొన్ననే పుట్టినరోజు చేసుకుంటివి.. ఇంతలోనే ఏం జరిగింది కొడుకా.. మేమేం పాపం చేశాం.. మాకెందుకీ శిక్ష దేవుడా అంటూ ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కలచివేసింది. రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లా రేణిగుంట వెళ్లి కోడూరు మండల పరిధిలోని గొల్లపాలెం గ్రామానికి చెందిన యువకుడు ఇంద్ర బాబు (Indra Babu) రేణిగుంటకు వ్యవసాయ పనులకు వెళ్లి కరెంట్ షాక్తో మృతి చెందాడు.
అతడి మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం (Postmortem) నిర్వహించి శనివారం గ్రామానికి తీసుకొచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూడగానే ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అచ్చటా ముచ్చటా తీరకుండానే వెళ్లిపోయావా నాయనా అంటూ గుండెలను బాదుకున్నారు. ఇంద్రబాబుకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. గ్రామం లో విషాదఛాయలు అలుముకున్నాయి.
