ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో..

ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ..

తణుకు (ఆంధ్రప్రభ): తణుకు పట్టణానికి చెందిన వీరమల్లు ఫణీంద్ర కుమార్ (45) గురువారం రాత్రి ఆయన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఫణీంద్ర కుమార్ గతంలో వైసీపీ తణుకు నియోజకవర్గ యువజన అధ్యక్షుడిగా పనిచేశారు. ఆర్థిక ఇబ్బందులు నేపథ్యంలో ఉరి వేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు హుటాహుటిన ఫణీంద్ర కుమార్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలియజేశారు. మృతుడు ఫణీంద్ర కుమార్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తణుకు పట్టణ ఎస్ఐ కె.శ్రీనివాస్ కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply