విజయవాడ.. హైదరాబాద్ ఆరు వరుసల రోడ్డుకు లైన్ క్లియర్

ఆంధ్రప్రభ, విజయవాడ : హైదరాబాద్ – విజయవాడ హైవేకు ఆరు లేన్లకు విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుండి విజయవాడ వరకు ప్రస్తుత నాలుగు లైన్ల NH-65 రోడ్డును 6 లేన్లకు విస్తరించేందుకు పచ్చజెండా ఊపింది మొత్తం దూరం: 229 కిలోమీటర్లు కాగ తెలంగాణలో 40 కిలోమీటర్లు, ఏపీలో 263 కిలోమీటర్ల వరకు విస్తరిస్తారు.

ఏపీలోని నందిగామ మండలంలో 4 గ్రామాలు, కంచికచర్ల మండలంలో 4 గ్రామాలు, జగ్గయ్యపేట మండలంలో 7 గ్రామాలు, పెనుగంచి ప్రోలు మండలంలో 3 గ్రామాలు, ఇబ్రహీంపట్నం మండలంలో 12 గ్రామాలు, విజయవాడ రూరల్ మండలంలో 1 గ్రామం, విజయవాడ వెస్ట్ మండలంలో 2 గ్రామాలు, విజయవాడ నార్త్ 1 గ్రామం రోడ్డు విస్తరణకు భూమిని సేకరిస్తారు. భూసేకరణ పనుల బాధ్యతను ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్లకు అప్పగించారు.ఈ మేరకు కేంద్ర రహదారి , రవాణా శాఖ నుంచి మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది. త్వరలో ఈ హైవే 6 లేన్ల జాతీయ రహదారిగా మారి ప్రయాణం మరింత వేగవంతం కానుంది.

Leave a Reply