కార్యాలయం ముట్టడించిన మాదాసి కుర్వలు…
ఊట్కూర్, ఆంధ్రప్రభ : తమకు ప్రభుత్వం ఎస్సీ ధ్రువీకరణ పత్రాలు(SC Certificates) మంజూరు చేయాలని కోరుతూ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో మాదాసికుర్వ సంఘo ఆధ్వర్యంలో ఊట్కూర్ తాసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి సీనియర్ అసిస్టెంట్ రాఘవేందర్ రెడ్డి(Assistant Raghavender Reddy)కి వినతి పత్రం సమర్పించారు. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి భారీ ర్యాలీగా వచ్చి తాసిల్దార్ కార్యాలయ ముట్టడి చేపట్టారు.
ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ.. రాత్రి, పగలు తేడా లేకుండా అడవిలో జీవిస్తున్న తమకు ప్రభుత్వం వెంటనే ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మాదాసికుర్వలు గత కొన్ని ఏళ్లుగా ఎస్సీ ధ్రువీకరణ పత్రాలు(SC Certificates) మంజూరు చేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
నారాయణపేట జిల్లాలో వెనుకబడిన తమకు అధికారులు వెంటనే స్పందించి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర నాయకుడు నాగరాజు, తాలూకా ఉపాధ్యక్షుడు హన్మంతు(Hanmanthu), జిల్లా ఉపాధ్యక్షుడు ఆశప్ప, మక్తల్ తాలూకా అధ్యక్షుడు అంజప్ప, మండల అధ్యక్షుడు పెద్దపోర్ల లింగప్ప, నాయకుడు పెద్ద గోవిందప్ప తదితరులు పాల్గొన్నారు.

