రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
కమ్మర్ పల్లి, నవంబర్ 5 (ఆంధ్ర ప్రభ) : కమ్మర్ పల్లి మండలం హాస కొత్తూరు ఉన్నత పాఠశాలకు చెందిన ప్రతిభ, ఆశ్రీత అనే ఇద్దరు విద్యార్థినీలు రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీల (State level handball competitions) కు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణశ్రీ బుధవారం తెలిపారు.
జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో మంచి ప్రతిభ కనబర్చడంతో సెలెక్టర్ లు ఇద్దరు విద్యార్థినీలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసారని తెలిపారు. సంగారెడ్డి లో ఈ నెల ఏడు నుండి మూడు రోజుల పాటు జరిగే హ్యాండ్ బాల్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు.విద్యార్థినీలతో పాటు శీక్షణ ఇచ్చిన పాఠశాల పి డి మాధురి ని హెచ్ ఎం తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.

