విద్యుత్ షాక్ తగిలి గొర్రెల మృతి..

విద్యుత్ షాక్ తగిలి గొర్రెల మృతి..
బిక్కనూర్, (ఆంధ్రప్రభ)..
మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో బుధవారం విద్యుత్ షాక్ తగిలి రెండు గొర్రెలు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన కొమురయ్య తన గొర్రెల మందను గ్రామ శివారులో గల సబ్ స్టేషన్ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లినట్లు తెలిపారు. అక్కడ వ్యవసాయ బావుల వద్ద ఉన్నా విద్యుత్ వైర్లు రెండు గొర్రెలకు తగల అక్కడికక్కడే రెండు గొర్రెలు మృతి చెందినట్లు తెలిపారు. ఇట్టి విషయాన్ని బాధిత రైతు విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతు కోరారు.
