ఇల్లెందు : ఇల్లెందు మండలం కొమరారం అటవీశాఖ రేంజ్ కార్యాలయంలో ఈరోజు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ వ్యక్తి నుండి రూ.30వేలు లంచం తీసుకుంటూ రేంజర్ ఉదయ్ కిరణ్, బీట్ అధికారి హరిలాల్ పట్టుబడ్డారు. అటవీ భూమి నుండి గ్రావెల్ తోలేందుకు రూ.30,000 డిమాండ్ చేయగా, వారు ఏసీబీని ఆశ్రయించారు.