బ్యాంకుల్లో ఉద్యోగ అవకాశాలు…
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఇంపార్టికస్ ఆధ్వర్యంలో ప్రైవేట్ బ్యాంకులలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ప్రైవేట్ బ్యాంకులైన హెచ్ డి ఎఫ్ సి, ఐసిఐసి, ఎక్సెస్ సిటీ బ్యాంక్, కోటక్, మహేంద్ర, బ్యాంకుల్లో ఆయా బ్యాంకుల యజమాన్యాలు(bank owners) ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని, ఉద్యోగాలకై బ్యాంకుల్లో యజమాన్యాలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయ ని, ఉద్యోగాల నియామకం కోసం ఈ నెల 11న ఉట్నూర్ లోని కేబి కాంప్లెక్స్ లోగల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, డిగ్రీకళాశాలల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్ తెలిపారు.
ఈ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ 50% మార్కులతో పూర్తి చేసుకొని, 26 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు అర్హులు. ఇందులో ఎంపికైన వారికి 20,000కు(20,000 for selected candidates) పైగా జీతం ఉంటుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్తులు తమ సర్టిఫికెట్లతో, ఆధార్, పాన్ కార్డులతో ఈనెల 11 న ఉదయం 10:00 గంటలకు కళాశాల ప్రాంగణంలో హాజరు కావాలని ప్రిన్సిపాల్ కోరారు. మరిన్ని వివరాలకు టీఎస్ కెసి కో-ఆర్డినేటర్ ముజీబ్, మెంటర్ చైతన్య, 9885762227, 9321825562 నంబర్లకు సంప్రదించాలని ప్రిన్సిపాల్ కోరారు.

