కరడుగట్టిన దొంగను పట్టించిన సీసీ కెమెరా

కరడుగట్టిన దొంగను పట్టించిన సీసీ కెమెరా

  • అరెస్టు చేసి వివరాలు వెల్లడించిన డి.ఎస్.పి శివరాం రెడ్డి
  • ఆరు తులాల బంగారం 35 తులాల వెండి ఒక బైకు స్వాధీనం

నల్గొండ, ఆంధ్ర ప్రభ : నిత్యం చోరీలు చేస్తూ సామన్య ప్రజలు బెంబేలెత్తిస్తున్న ఓ కరుడు గట్టిన దొంగను నల్లగొండ వన్ టౌన్ పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో డిఎస్పి శివరామిరెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నల్లగొండలోని శాంతి నగర్ కు చెందిన పంచాయతీ కార్యదర్శి జెర్రిపోతుల రవి(Jerrypotula Ravi) గత నెల 25న రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా ఊరికి వెళ్లాడు.

కనగల్ మండలం జీ. యడవెళ్లి గ్రామానికి చెందిన రుద్రాక్షి శ్రీను అదేరోజు రాత్రి తాళం పగలగొట్టి రవి ఇంట్లో ఉన్న బంగారం, కొంత మేర నగదు చోరీ చేసి, పక్కనే ఉన్న‌ మరో బైకును కూడా తస్కరించాడు. దేవరకొండ రోడ్డులోని కనక దుర్గకాలనీలో మరొక ఇంట్లో దొంగతనం చేశాడు. దీంతో బాధితులంతా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మరుసటిరోజు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి(Amireddy Rajasekhar Reddy) ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని నిందితుడికోసం నిరంతరం శ్రమిస్తూ వందల సంఖ్యలో సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించి దొంగతనం చేసింది రుద్రాక్షి శ్రీనుగా గుర్తించారు.

రెండు ప్రత్యేక టీంలుగా ఏర్పడిన పోలీసులు నిందితుడిని గాలిస్తున్న క్రమంలో ఈ రోజు ఉదయం మునుగోడు రోడ్డులో వెహికల్ చెకింగ్(Vehicle Checking) చేస్తుండగా, అనుమానాస్పదంగా బైక్ పై పారిపోతున్న ఓ వ్యక్తిని సీసీఎస్, వన్ టౌన్ పోలీసులు పట్టుకుని పాత నేరస్థుడు రుద్రాక్షి శ్రీనుగా గుర్తించారు. వన్ టౌన్ కు తీసుకెళ్లి విచారించగా నేరం ఒప్పుకున్నాడు. సుమారు రూ.12లక్షల విలువైన 6తులాల బంగారం, 35తులాల వెండి, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. క్రైం నెంబర్ 309/యూ/ఎస్331(2), 305(ఏ) బీఎన్ఎస్ కింద కేసులు నమోదు చేసి, రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.

అయితే రుద్రాక్షి శ్రీను గతంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్(Telangana, Andhra Pradesh)లోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 40 వరకు దొంగతనాలు చేసి ఇటీవల తిరుపతి జైలుకు వెళ్లి పదిహేను రోజుల క్రితం బయటకు వచ్చాడు.

ఈ కేసును సీసీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా కేవలం వారం రోజుల్లోనే కరుడుగట్టిన అంతరాష్ట్ర దొంగను పట్టుకున్న నల్లగొండ డీఎస్పీ కే. శివరాంరెడ్డిని, సీసీఎస్ సీఐ జితేందర్ రెడ్డి(CCS CI Jitender Reddy), చంద్ర శేఖర్ రెడ్డి, ఎస్సై విజయ్, హెడ్ కానిస్టేబుల్ విష్ణు, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు సైదులు, గోపాలరావు, వెంకట నారాయణ, షకీల్, ఫింగర్ ప్రింట్స్ ఎస్ఐ శివ, సీసీఎస్ సిబ్బంది సాయి, మహేష్, వహీద్, దస్తగిరి జునైద్ లను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.

Leave a Reply