రూ.40 లక్షల విలువైన వెండి గజ వాహనం విరాళం
శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో అందజేత
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారికి (Sri Seetha Ramachandra Swamy) హైదరాబాద్‌కు చెందిన భక్తులు శంకర్ నారాయణ, రాజ్యలక్ష్మి దంపతులు విలువైన వెండి గజ వాహనాన్ని సమర్పించారు. వీరు సుమారు 31 కిలోల వెండితో తయారు చేసిన, రూ.40 లక్షల విలువగల వెండి గజ వాహనంను ఆలయానికి అందజేశారు.
ఈ వాహనాన్ని ఆలయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆలయ ఈఓ దామోదర్ రావు చేతుల మీదుగా దేవస్థానానికి అందజేశారు. ఈ సందర్భంగా ఈఓ దామోదర్ రావు మాట్లాడుతూ.. భక్తుల సమర్పణలతో ఆలయ అభివృద్ధి మరింత బలపడుతుందని, భక్తుల అంకితభావం దేవుడి దయకు నిదర్శనమని పేర్కొన్నారు.

