గూండాగిరి చేస్తే.. గల్లాపట్టి నిలదీస్తాం.. – కేటీఆర్
హైదరాబాద్ (ఆంధ్రప్రభ)
బోరబండ బస్ స్టాప్ నుండి హైటెక్ హోటల్ వరకు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్ తో కేటీఆర్ రోడ్ షో జరిగింది. పెద్ద ఎత్తున స్వాగతం బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు స్వాగతం పలికారు. బోరబండకు బుల్డోజర్ రావద్దంటే.. మాగంటి సునీతమ్మను గెలిపించండి.. బుల్డోజర్లకు అడ్డంగా మేముంటాం.. సునీతమ్మ ఒంటరి కాదు.. మేమందరం ఉన్నాం.. అర్దరాత్రి ఫోన్ చేసినా అర్ధ గంటలో మీ ముందుంటాం. ఎవడన్నా కాంగ్రెసోడు గూండాగిరి చేసినా గల్లాపట్టి నిలదీస్తాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నేను.. నా ఇద్దరు ఆడ బిడ్డలు గోపన్న ఆశయాలను నెరవేర్చడానికి గడప గడపకు వెళ్తుంటే.. మాపై అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ సర్కార్ వేధిస్తుంది అన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. ఎవ్వరికీ భయపడేది లేదని.. మీ ఇంటి ఆడబిడ్డలా మీకు తోడుగా.. అండగా ఉంటానని.. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ అన్నారు.

