- ఏలూరు వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా
- ఒకరు మృతి, పలువురికి గాయాలు
ఏలూరు, ఆంధ్రప్రభ : ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. లింగంపాలెం జూబ్లీ నగర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సు భారతి ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసు, అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

