అండగా ఉంటామని భరోసా..
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ పేట(Ismail Khan’s stomach) వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్(Chinta Prabhakar) ఈ రోజు ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సూచించారు. కేసీఆరే రైతులకుఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, సకాలంలో వారికి డబ్బులు జమ చేసే విధంగా కృషి చేశారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పాలనలో రైతుల ఇబ్బందులు వర్ణాతితం అని, కాంగ్రెస్(Congress) పాలనలో రైతులు సంతోషంగా లేరని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తగిన బరువులు, గోనె సంచులు, టార్పాలిన్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతులకు ఎలాంటి కష్టం వచ్చినా వారికి అండగా ఉంటామని భరోసా నిచ్చారు.
కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం(Patnam Manikyam), మాజీ సీడీసీ చైర్మన్ కసాల బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి, గోనెలా రఘు, అధికారులు, రైతులు ఉన్నారు.

