Warangal | న‌న్నపునేని నరేందర్ ఆధ్వ‌ర్యంలో కెసిఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు

కేసీఆర్ భారీ కటౌట్ కు పాలాభిషేకం, పుష్పాభిషేకం
పండుగ వాతావరణం ల ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు.
ప్రత్యేక ఆకర్షణ గా నిలిచినా కెసిఆర్ భారీ కటౌట్
భారీ బాణాసంచా నడుమ డీజే సౌండ్స్ తో కార్యకర్తల హంగామా
కేక్ కట్ చేసి కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలిపిన నన్నపునేని నరేందర్.
కార్యకర్తలతో నిండి గులాబీమయమైన పోచమ్మమైదాన్ జంక్షన్.

హనుమకొండ , ఆంధ్ర‌ప్ర‌భ – తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్బంగా ఈ రోజు వరంగల్ తూర్పు పొచమ్మమైదాన్ సెంటర్ లో తెలంగాణ రాష్ట్ర వరంగల్ తొలి మేయర్, మాజీ శాసనసభ్యుడు నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో ఘ‌నంగా బ‌ర్త్ డే వేడుక‌లు నిర్వ‌హించారు.. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ భారీ కటౌట్ ఏర్పాటు చేసి ఆ కటౌట్ కు పాలాభిషేకం చేశారు. అలాగే పుష్పాల‌తో అభిషేకించి కెసిఆర్ పై ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు న‌రేంద‌ర్.

అనంతరం కార్యకర్తలతో కలిసి భారీ కేక్ ను ఏర్పాటు చేసి కార్యకర్తల నడుమునా వారితో కలిసి కేక్ కట్టింగ్ చేసి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యకర్తలు అందరూ కలిసి కేసీఆర్ పాటలతో పోచమ్మమైదాన్ జంక్షన్ లో పండుగా వాతావరణం లో ఈ వేడుకలను నిర్వహించుకున్నారు.

ఆ త‌ర్వాత మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు వృక్షర్చనా లో భాగంగా వరంగల్ తూర్పు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి సీకేఎం కళాశాల మైదానంలో మొక్కను నాటారు.

అస‌లు సిస‌లైన మాన‌వ‌తావాది కేసీఆర్‌..

ఈ సంద‌ర్భంగా న‌న్న‌పునేని న‌రేంద‌ర్ మాట్లాడుతూ కేసీఆర్ అస‌లు సిస‌లైన మాన‌వతావాది అన్నారు. ఈ రోజు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందిరికి ఒక పండుగ రోజు అని అన్నారు. ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను చూసి చ‌లించిపోయి ప్ర‌త్యేక తెలంగాణ సాధ‌న కోసం ఉద్య‌మం చేశార‌ని గుర్తు చేశారు. బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల కోసం ఎన్నో త్యాగాలు చేశార‌ని గుర్తు చేశారు. తెలంగాణ‌లోని తొలి ముఖ్య‌మంత్రి అయిన కేసీఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసి బ‌డుగు బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు అండ‌గా నిలిచార‌ని చెప్పారు. తెలంగాణ‌లోని ప‌దేళ్ల పాల‌న‌లో ఒక వైపు అభివృద్ధి, మ‌రోవైపు సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేసి ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందార‌న్నారు.

బీసీ బిడ్డ‌గా ఆద‌రించిన నేత‌
ఒక బీసీ బిడ్డ అయినా త‌న‌ను కేసీఆర్ ఆద‌రించార‌ని న‌రేంద‌ర్ అన్నారు. వ‌రంగ‌ల్ మేయర్, ఎమ్మెల్యే ను చేసి త‌న‌ను ఈ రోజు ఈ స్థాయిలో ఉంచిన కేసీఆర్ కి త‌న‌ జీవితం మొత్తం రుణపడి ఉంటాన‌ని చెప్పారు. కేసీఆర్ మ‌ళ్లీ సీఎం కావాల‌ని, త‌మ‌ జీవితాల్లో వెలుగులు నింపాలి అని ప్రతి వ్యక్తి కోరుకుంటున్నార‌న్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వ‌స్తోంద‌న్నారు. అప్పుడు ఈ జన్మదిన వేడుకలు మరింత ఘనంగా నిర్వహించుకుంటామ‌ని నరేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో 34 వ డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, మాజీ మార్కెట్ చైర్మన్ టి. రమేష్ బాబు, మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకురాలు, యూత్ నాయకులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం లో 34 వ డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, మాజీ మార్కెట్ చైర్మన్ టి. రమేష్ బాబు, మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకురాలు, యూత్ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *