పోరాడి ఉంటే.. అక్కడ కూడా గెలిచేవాళ్లం – చంద్రబాబు
పుట్టపర్తి (ఆంధ్రప్రభ) గత ఎన్నికల్లో పోరాడి ఉంటే.. పులివెందులలో కూడా గెలిచేవాళ్లం అని అన్నారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం పెద్దన్నవారి పల్లెలో తెలుగుదేశం పార్టీ నాయకులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గుజరాత్ నిరంతరం బీజేపీ గెలిచి అధికారంలో కొనసాగుతుంది. ఇక్కడ కూడా నిరంతరం గెలిచేలా ఇక పై రాజకీయం చేస్తాను అన్నారు. అయితే.. ఏదైనా సాధించాలంటే సమిష్టగా కష్టపడితేనే సాధ్యమౌతుంది. అందుచేత అందరం కలిసి పోరాడదాం.. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉండాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. మనం చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచేయాలి. ఈ సమావేశంలో మహిళలు పెద్దగా కనిపించడం లేదు.. పార్టీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి అన్నారు.

