అచ్చంపేట, (ఆంధ్రప్రభ): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌గా కే. సద్దాం హుస్సేన్ శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు.
బాధ్యతలు స్వీకరించిన తర్వాత సద్దాం హుస్సేన్ మాట్లాడుతూ, అచ్చంపేట పట్టణంలో నేరాలను నియంత్రించడానికి, శాంతి భద్రతలను బలోపేతం చేయడానికి ప్రజల సహకారంతో పనిచేస్తానని అన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
అయితే, గతంలో ఇక్కడ ఎస్సైగా పనిచేసిన విజయభాస్కర్‌ను శాఖాపరమైన కారణాల వల్ల నారాయణపేట ఎస్పీ కార్యాలయానికి వీఆర్ అటాచ్ చేసినట్లు సమాచారం.

