కోతకు గురైన వంద ఫీట్ల రోడ్డు
కాలనీ రహదారులు బురదమయం
హనమకొండ, ఆంధ్రప్రభ : ఓరుగల్లులో వరద నీరు తగ్గింది. తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా ముంపునకు గురైన హనమకొండలో ఇప్పుడిప్పుడు తేరుకుంటుంది. వివేక్ నగర్ కాలనీ, గోకుల్ నగర్, అమరావతి నగర్, కూడా కాలనీ, టీవీ టవర్ కాలనీ, హనుమకొండ చౌరస్తా, కాపువాడ, సమ్మయ్య నగర్, ఇందిరమ్మ కాలనీ,జూలైవాడ ప్రగతి నగర్,నాగేంద్రనగర్, రాంనగర్,కిషన్ పుర, బొక్కల గడ్డ,జూలైవాడ ప్రగతి నగర్, నాగేంద్రనగర కాలనీలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గురువారం అర్థరాత్రి నుంచి కాలనీల్లో వరద తగ్గుముఖం పట్టింది. కాలనీలన్ని బురదమయంగా మారింది. దుర్గంధం వెదజల్లుతుంది.
హనుమకొండ, కాజీపేట వంద అడుగుల రోడ్ పూర్తిగా కోతకు గురైంది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో విలువైన వస్తువులు ధ్వంసంమైనట్లు ప్రజలు గోగ్గులు పెడుతున్నారు. తుఫాన్ అంచనా వేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపామని అధికారులు ఎవరు కన్నెత్తి చూడలేదని వాపోయారు. తిండి లేక నాన్న అవస్థలు పడ్డామని అన్నారు. వివేక్ నగర్ కాలనీ, సమ్మయ్య నగర్ అమరావతి నగర్ కాలనీలు జలదిబ్బంధంలో చిక్కుకోవడానికి నీటిపారుదల శాఖ అధికార లేనని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రో్జు కాలనీలల్లో మున్సిపల్ సిబ్బంది, ఎస్ డి ఆర్ ఎ ప్ బృందాలు చేరుకొని శుభ్రం చేస్తున్నారు. వివేక్ నగర్ కాలనీలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయిలు సందర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తుఫాన్ లో తీవ్రంగా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రకృతి వల్ల అతి పెద్ద భారీ వర్షం నగరంలో పడడం చాలా బాధాకరమని తెలిపారు.

