పటేల్ తీసుకున్న నిర్ణయాల వలనే..
బాసర (ఆంధ్రప్రభ) : మండల కేంద్రంలో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుండి ఆలయం రహదారి గుండా రైల్వే స్టేషన్ శివాజీ చౌక్ వరకు 2కే రన్ నిర్వహించారు. శివాజీ చౌక్ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎస్ ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న నిర్ణయాల వలనే భారతదేశంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విలీనం అయిందని పేర్కొన్నారు. 2 కె రాన్ లో నాగభూషణం విద్యాలయ విద్యార్థులతో పాటు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

