ఆ సైకో హ‌తం…

ముంబై మహానగరంలో నడిరోడ్డుపై సినిమా సన్నివేశాలను తలపించే భీకరమైన ఉదంతం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి సినిమా అవకాశాల పేరుతో 17 మంది బాలబాలికలను అపహరించి, వారిని ఆర్‌.డి. స్టూడియోస్ బంధించాడు.

ఈ దారుణ చర్యపై సమాచారం అందిన వెంటనే, ముంబై పోలీసులు చురుకుగా స్పందించి, రెస్యూ ఆపరేషన్‌ను ప్రారంభించారు.
ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని రోహిత్ ఆర్యగా గుర్తించారు. బందీలుగా పట్టుకున్న పిల్లలకు హాని తలపెట్టకముందే, అతడు తన ఉద్దేశాలను వివరిస్తూ ఒక వీడియో క్లిప్‌ను సామాజిక మాధ్యమాలలో పంచుకున్నాడు.

తాను ఏ ఉగ్ర సంస్థకు చెందినవాడిని కానని, ధనార్జన తన లక్ష్యం కాదని, కేవలం ఆత్మహత్య చేసుకోకుండా సమాజం దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు అందులో పేర్కొన్నాడు.

పోలీసులు అతడితో సంప్రదింపులు జరుపుతున్న తరుణంలో, రోహిత్ ఆర్య అకస్మాత్తుగా తుపాకీతో కాల్పులు జరిపాడు. పరిస్థితి చేయి దాటడంతో, పిల్లల భద్రత దృష్ట్యా పోలీసులు వెంటనే ప్రతిదాడి చేశారు. ఈ భీకర ఎన్కౌంట‌ర్లో నిందితుడు రోహిత్ ఆర్య మరణించాడు.

పోలీసుల సాహసోపేతమైన చర్యల ఫలితంగా, అపహరణకు గురైన 17 మంది చిన్నారులు ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. తమ పిల్లలు సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు, ఆ ప్రాంత నివాసితులు ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply