వాగులో చిక్కుకున్న మూగ జీవాలు

వాగులో చిక్కుకున్న మూగ జీవాలు
ఉధృతంగా వాగులు
…….
ఉప్పునుంతల, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల జలమయమైంది.
జిల్లాలో అత్యధికంగా 183 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
ఎక్కడికక్కడే రాకపోకలు నిలిచిపోయాయి.
మండలంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి.



పూర్వ నాయక్ తండ వద్ద వాగులో మూగజీవాలు వాగులో చిక్కుకున్నాయి.
పూర్య నాయక్ తండ పక్కన చంద్ర వాగు లో రెండు ఆవులు , బర్రెలు చిక్కిపోయాయి. వాటిని రక్షించాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు.
ప్రధాన వాగుల వైపు ఎవరు వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
