మొండిచేయి చూపడం తగదు
హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని లంబాడీలకు కేటాయించాలని హైకోర్టు అడ్వకేట్(High Court Advocate), సామాజిక తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ భూక్య కృష్ణ నాయక్ డిమాండ్ చేశారు.
ఈ రోజు స్థానికంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. సూర్యాపేట జిల్లా(Suryapet District)లోని నాలుగు నియోజకవర్గాలైన హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తిలలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అయిన లంబాడీలను కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ గుర్తించి డీసీసీ పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తెలిపారు.
మొండిచేయి చూపడం తగదు..
సూర్యాపేట జిల్లాలో లంబాడీలు ఓటు బ్యాంకుగా మాత్రమే ఉన్నారని, ముఖ్యమైన పదవులలో లంబాడీలకు మొండి చేయి చూపిస్తున్నారని కృష్ణ నాయక్ అన్నారు. డీసీసీ(DCC) పదవి లంబాడీలకు ఇచ్చి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకోవాలని, లంబాడీలకు డీసీసీ పదవి ఇచ్చే విధంగా కమిటీ పరిశీలకులకు సూచించాలని తెలిపారు.
హుజూర్‌నగర్ నియోజకవర్గంలో సుమారు 40 వేలకు పై చిలుకు ఓట్లు కలిగినటువంటి లంబాడీలకు ఎస్టీ రిజర్వ్(ST Reserve) చేయాలని 2026 డిలిమిటేషన్ కమిటీకి సిఫారసును పంపాలని కోరారు.

