కెనడాలో భారత సంతతి వ్యాపారవేత్త హత్య
ఆంధ్రప్రభ వెబ్డెస్క్: కెనడాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త దర్శన్, కానమ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు సింగ్ సాహ్సీ(Singh Sahsi) (68) దారుణ హత్యకు గురయ్యారు. కానమ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు దర్శన్ సింగ్ సాహ్సీ (68) కాల్పుల్లో మరణించారు. బ్రిటీష్ కొలంబియా(British Columbia)లోని అబాట్స్ ఫోర్డ్ లో ఆయన ఇంటి వెలుపల కారులో కూర్చుంటున్న సమయంలో ఓ దుండగుడు అతనిపై కాల్పులు జరిపి పరారయ్యారు.
అక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కెనడా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 9.22 గంటల సమయంలో రిడ్జ్ వ్యూ డ్రైవ్(Ridge View Drive)లో కాల్పులు జరిగాయి. పోలీసులు అక్కడికి చేరుకునే సరికే సాహ్సీ తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వెంటనే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అందించినా ఫలితం లేకపోయిందని పోలీసులు తెలిపారు.
ఈ కేసును అబాట్స్ ఫోర్డ్ మేజర్ క్రైమ్(Ford Major Crime) యూనిట్ నుంచి ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కు బదిలీ చేశామని, తదుపరి వివరాలను వారే వెల్లడిస్తారని తెలిపారు. దర్శన్ సింగ్ సాహ్సీ సొంత ఊరు పంజాబ్ లోని లుథియానా జిల్లా, రాజ్ గఢ్ గ్రామం(Rajgarh Village). 1991లోనే కెనడాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆయన స్థాపించిన కానమ్ గ్రూప్.. ప్రపంచంలోని అతిపెద్ద రీసైక్లింగ్ కంపెనీల్లో ఒకటి.

