అందులో.. నేరస్థులు సిద్ధహస్తులు..

అందులో.. నేరస్థులు సిద్ధహస్తులు..

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న రాత్రి పూట చోరీల కేసులను విజయవంతంగా ఛేదించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అదనపు ఎస్పి(క్రైమ్) పి. శ్రీనివాసరావు(P. Srinivasa Rao) తెలిపారు. అరెస్టు అయిన ముగ్గురు వ్యక్తుల నుంచి పై కేసులలో పోయిన 186 గ్రాముల బంగారు, 263 గ్రామల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏ ఎస్ పీ తెలిపారు.

ఈ నెల 14వ తేదీన నందగిరిపేట గ్రామంలో రెండు, రాగోలు గ్రామంలో ఒక దొంగతనం కేసు, అలాగే గార పోలీస్ స్టేషన్ పరిధిలోని కె.మత్య్సలేశం గ్రామంలో మూడు దొంగతనం కేసులు సెప్టెంబర్ 28న నమోదయ్యాయి. నిందితులు రాత్రిపూట ఇంటి తలుపులకు వేసిన తాళాలను పగలగొట్టి, ఇంటిలోని బంగారం, వెండి(Gold, Silver) ఆభరణాలు, నగదును దొంగలించారు. కాకినాడకు చెందిన రేకడి వెంకటేశ్వర్లు, ఆంజ‌నేయస్వామి(Venkateswarlu, Anjaneyaswamy) ల‌పై 23 కేసులు నమోదు కాగా, కాకినాడ నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ ఉన్నట్లు ఏఎస్ పి తెలిపారు.

కాకినాడకే చెందిన ధర్మాది ప్రసాద్ పై 36 కేసులు నమోదు కాగా, కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ ఉందని, మాడెం మోహన్ కుమార్ అనే నిందితుని పై హత్యా కేసు నమోదై ఉందని, ఇతను దొంగతనం సొత్తును అమ్మడంలో నైపుణ్యం కలవాడని తెలిపారు. నిందితులను 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం (Srikakulam) మండలం, నేషనల్ హైవే-16 సమీపంలోని తండేవలస గ్రామం వైపు ఉన్న జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఈ కేసులను అత్యంత చాకచక్యంగా ఛేదించి, నిందితులను అదుపులోకి తీసుకొని, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న శ్రీకాకుళం టౌన్ డీ.ఎస్.పీ. సి.హెచ్. వివేకానంద పర్యవేక్షణలో శ్రీకాకుళం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. పైడపు నాయుడు(Inspector K. Paidapu Naidu), శ్రీకాకుళం రూరల్ ఎస్సై కె. రాము, పోలీసు సిబ్బందిని, జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి అభినందించారు. ఈ సమావేశంలో సీఐ కె. పైడపు నాయుడు, ఎస్సై కే. రాము ఉన్నారు.

Leave a Reply