మహిళ మెడలో పుస్తెలతాడు చోరీ
త్రిపురారం, ఆంధ్రప్రభ : నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండలం (Tripuraram Mandal) లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. మండల పరిధిలోని నీలాయగూడెం గ్రామంలో మాజీ ఎంపీటీసీ సభ్యురాలు ఉమ్మడి శకుంతలమ్మ ఈ రోజు మధ్యాహ్నం తన వ్యవసాయ పొలం వద్దకు వెళుతున్నారు. మార్గమధ్యలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో నుంచి బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లారు. చోరీ చేసిన అనంతరం చైన్ స్నాచర్లు (ChainSnatching) బైక్ పై వెళుతున్న సీసీ ఫుటేజ్ ను గ్రామస్తులు పరిశీలించారు.

