ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్

వాతావరణ శాఖ హెచ్చరిక

ఒంగోలు రూరల్, అక్టోబర్27(ఆంధ్రప్రభ) : ఒంగోలు (Ongole) నగరంలోని లోతట్టు ప్రాంతం కొప్పోలు దగ్గర మురుగునీరు ప్రవాహ ప్రాంతాన్ని అధికారులతో కలిసి ఈరోజు ఉదయం శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ (Damacharla Janardhan) పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే జనార్దన్ మాట్లాడుతూ.. మొoథా తుపాను తీవ్రస్థాయిలో ఉంటుందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నియోజకవర్గంలోని రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, విద్యుత్, వ్యవసాయ అధికారులకు పలు సూచనలు చేశారు.

ప్రమాదాలను ముందస్తుగా అంచనా వేసి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలన్నారు. అధికారులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పని చేయాలన్నారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు స్థానిక నాయకుల సహకారంతో సహాయ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు అవసరమైన సౌకర్యాలను కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సుజాత, కమీషనర్ వెంకటేశ్వరావు, తహసీల్దార్ మధు, పార్టీ నాయకులు తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply