బీజేపీ వాల్ పోస్టర్ విడుదల
హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రౌడీలకు, గుండాలకు ఆరు గ్యారెంటీల(Six guarantees) పథకాన్ని కచ్చితంగా అమలు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు(Ramachander Rao) అన్నారు. ఈ రోజు ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఒక వాల్‌పోస్టర్‌ను రామచందర్ రావు విడుదల చేశారు.
కాంగ్రెస్ గెలిస్తే ఈ ఆరు గ్యారెంట్లీను అమలు చేస్తుందన్నారు. రౌడీలు గుండాలపై కేసులు ఎత్తివేయటం, మామూలు వసూలు చేయడానికి అనుమతులు ఇవ్వడం, బెదిరింపులు దౌర్జన్యాలపై కేసులు నమోదు చేయకుండా ఉండటం, వయసు పైబడిన రౌడీ షీటర్ల(rowdy sheeters)కు నెలకు 50 వేలు పింఛన్ ఇవ్వడం, రౌడీ షీటర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, భూ కబ్జాలు సెటిల్మెంట్లకు ప్రత్యేక లైసెన్సులు జారీ చేయడం ఈ ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తుందని అన్నారు. ప్రజలు సంక్షేమం కోసం కృషి చేస్తున్న బీజేపీ(BJP)కి పట్టం కట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

